ఈ 3 రోజుల్లో క్షవరం చేయించుకుంటే అష్టదరిద్రం !

Which day is good for hair cut in telugu | క్షవరం ఏ రోజు చేసుకోవాలి

ఈ మూడు రోజుల్లో క్షవరం చేయించుకుంటే అష్ట దరిద్రం.
మీరు కోరి కష్టాలు కొనితెచ్చుకున్నట్లు!!

హిందూ ధర్మం ప్రకారం ప్రతి హిందువు తెలుసుకోవలసిన అనేక విషయాలు, మర్మాలు ఎన్నో ఉన్నాయి. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం పురుషులు హెయిర్ కటింగ్ ఏరోజు పడితే ఆరోజు చేయించుకోకూడదు.

కేవలం హెయిర్ కటింగ్ మాత్రమే కాకుండా గోర్లు కత్తిరించడానికి కూడా వారం-వర్జ్యం తప్పనిసరిగా పాటించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జుట్టు మరియు గోర్లు వారం-వర్జ్యం పాటించకుండా కత్తిరిస్తే అష్ట దరిద్రాలు తిష్ట వేస్తాయి.

హెయిర్ కటింగ్ క్షవరం ఎప్పుడు చేయించకూడదు:-

*చాలా వరకు మగవారు ఆదివారం సెలవు దినం కాబట్టి ఆదివారం రోజు హెయిర్ కటింగ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

*అదేవిధంగా మంగళవారం, శనివారం కూడా హెయిర్ కటింగ్ చేయించుకుంటూ వుంటారు. కాబట్టి ఆదివారం, మంగళవారం మరియు శనివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు.

*మధ్యాహ్నం 11 నుండి ఒంటి గంట మధ్య హెయిర్ కటింగ్ చేయించకూడదు.

*అలాగే సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య చేయించకూడదు.

*పౌర్ణమి, అమావాస్య, పాడ్యమి, చవితి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, అష్టమి మరియు నవమి తిథులలో హెయిర్ కటింగ్ చేయించరాదు.

*జన్మ నక్షత్రం రోజున క్షవరం చేయించ కూడదు.

*రాశి సంక్రమణ జరిగే రోజు కూడా హెయిర్ కటింగ్ చేయించకూడదు.

*కొన్ని హిందూ కుటుంబాలలో పిండ ప్రధానం చేసిన తర్వాత గుండు గీయించుకుంటారు. కానీ ఇది దోషమని శాస్త్రం తెలియజేస్తున్నది.

*కొంతమంది ప్రయాణం రోజు ఉదయం వేళ క్షవరం చేయించుకుని వెళ్తూ ఉంటారు. క్షవరం చేయించుకుని ఆ తర్వాత పొలిమేర దాటి వెళ్ళకూడదని శాస్త్రాలలో ఉన్నది. కాబట్టి ఎక్కడికైనా ప్రయాణమై వెళ్లే రోజు హెయిర్ కటింగ్ చేయించరాదు.

*మధ్యాహ్నం భోజనం తర్వాత సేవింగ్ వంటివి చేయించరాదు.

*సంధ్యా సమయంలో కూడా సేవింగ్, కటింగు చేయించకూడదు.

*మీ ఇంటిలో చేయబోయే శుభకార్యం రోజున సేవింగ్, కటింగు చేయించకూడదు.

*ఒకే ఇంటిలో ఉండే తండ్రి, కొడుకు లేదా అన్నా, తమ్ముడు ఒకే రోజు సేవింగ్, కటింగు చేయించకూడదు.

ఏఏ రోజులలో క్షవరం చేయించవచ్చు:-

మిగిలిన వారాలు సోమ, బుధ, గురు, శుక్ర రోజులలో ఆయుర్వృద్ధి కలుగుతుంది కాబట్టి ఈ రోజులలో క్షురకర్మ అంటే సేవింగ్ మరియు కటింగ్ చేయించుకుంటే మంచి ఫలితం కలుగుతుంది.

ఈ రోజులలో కూడా ఉదయం 6 నుండి మధ్యాహ్నం 11 లోపు చేయించుకోవడం మంచిది. సోమవారం రోజు సేవింగ్, కటింగు చేసుకుంటే ఏడు నెలల ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రం చెబుతున్నది.

బుధవారం రోజు హెయిర్ కట్ చేసుకుంటే ఐదు నెలల ఆయుష్షు పెరుగుతుందట. దీంతోపాటు కుటుంబంలో సుఖశాంతులు పెరిగి ధన ప్రాప్తి కలుగుతుంది

గురువారం రోజు హెయిర్ కట్ చేసుకుంటే పది నెలల ఆయుష్షు పెరుగుతుందని చెబుతారు. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే గురువారం రోజు సేవింగ్ కటింగ్ చేయించుకోవాలి.

శుక్రవారం రోజు హెయిర్ కట్ చేయించుకుంటే 11 నెలలు ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రం తెలియజేస్తున్నది. విదియ, తదియ, సప్తమి, త్రయోదశి తిధులలో సేవింగ్, కటింగు చేయించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి :-

  1. ఈ 4 రాశుల వారి జాతకం వచ్చే 5 సంవత్సరాలలో మారి కోటీశ్వరులు కాబోతున్నారు
  2. కార్తిక మాసంలో ఈ తప్పులు చేయకండి – శివుని ఆగ్రహానికి గురి కాకండి
  3. మగవారిలో కోర్కేలో పెరగాలంటే ఇవి గుప్పెడు తింటే చాలు
  4. రాత్రి పడుకునే ముందు స్త్రీలు ఇలా చేస్తే కుబేరులు అవుతారు