Tamarind Seeds Powder Uses In Telugu | చింత గింజలు ఉపయోగాలు
మగవారిలో కోరికలు తగ్గిపోతున్నాయా?
అయితే వీటిని గుప్పెడు తినండి చాలు!!
చింత చెట్టు ను భారతదేశపు ఖర్జూరపు చెట్టు అని అంటారు. ఎందుకంటే కేవలం చింతపండు మాత్రమే కాకుండా చింత గింజలు కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈరోజు ఈ ఆర్టికల్ లో చింత గింజలు యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
చింత గింజల ప్రయోజనాలు
*కొన్ని చింత గింజలు తీసుకుని వాటిని పెనంలో బాగా వేయించాలి. తర్వాత వీటిని రెండు రోజుల పాటు నీటిలో నానబెట్టాలి. కానీ ఉదయము మరియు రాత్రి పూట ఆ నీటిని మారుస్తూ ఉండాలి. రెండు రోజులుగా నానిన చింత గింజలను బయటకు తీసి పొట్టును వేరుచేయాలి.
పొట్టు తీసి వేసిన చింత గింజలను నీడలో ఆరబెట్టి, మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అర చెంచా పొడిని ప్రతి రోజూ ఉదయం మరియు రాత్రి పూట పాలతో గాని నీటితో గాని తాగాలి.
లేదా నెయ్యి లేదా చక్కెరతో కూడా కలిపి తీసుకోవచ్చు. ఇలా నాలుగు వారాల పాటు చేస్తే, మీకు ఉన్న ఎలాంటి నొప్పులు అయినా సరే తగ్గిపోతాయి. నొప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే చింతగింజలు లో కాల్షియం, మినరల్స్ అధికంగా ఉంటాయి.
ఇవి ఎముకలకు మంచి బలాన్ని ఇస్తాయి. ముఖ్యంగా కీళ్ల లో అరిగిపోయిన గుజ్జు ను తిరిగి ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి కీళ్ళనొప్పుల నుండి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు.
*ప్రతిరోజు రాత్రిపూట నిద్రకు ముందు మగవారు ఒక చెంచాడు చింతగింజల పొడిని పాలలో కలిపి తాగితే, మీ శరీరంలో లైంగిక శక్తిని పెంచి మీ శుక్రకణాల సంఖ్యను అధికం చేస్తాయి. శ్రృంగారం లో మీకు తిరుగు ఉండదు. మీ సంతాన సాఫల్యతను పెంచుతుంది.
*ముఖ్యంగా వయసు మీద పడిన స్త్రీలలో కీళ్ళబాధలు, నొప్పులతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి స్త్రీలు ప్రతిరోజు చింత గింజల పొడిని పాలతో గాని నీటితో గాని తాగితే శరీరంలోని నొప్పుల సమస్యను తొలగించుకోవచ్చు.
*కేవలం కీళ్ల నొప్పుల సమస్య కాకుండా డయేరియా, చర్మ సంబంధిత సమస్యలు, అజీర్ణ సమస్యలు వంటి ఎన్నో రకాల రోగాలను నయం చేస్తుంది.
*చింత గింజల పొడి తో బ్రష్ చేసుకుంటే పంటి మీద గార సులువుగా తొలగిపోతుంది.
*పొగతాగే అలవాటు ఉన్నవారు ఈ చింత గింజల పొడి తో బ్రష్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
*చింత గింజల లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల గొంతు నొప్పిని నివారించి, జలుబు, దగ్గు ను తగ్గిస్తాయి.
*గోరువెచ్చని నీటిలో చింతగింజల పొడి వేసుకుని మౌత్ వాష్ చేస్తే నోటి ఆరోగ్యం బాగుంటుంది.
*నానబెట్టిన చింత గింజలను పొట్టుతో సహా మిక్సీలో వేసి జ్యూస్ చేసుకుని తాగితే జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.
*చింత గింజల కు రోగనిరోధకశక్తిని పెంచే గుణం కలదు.
*రక్తంలో రక్త కణాలను పెంచి హిమోగ్లోబిన్ లెవెల్స్ ను అధికం చేస్తాయి.
*చింతగింజలు లో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తాయి.
*అధిక రక్తపీడనాన్ని కంట్రోల్ చేస్తాయి.
*ఎముకలు విరిగిన భాగాలమీద చింత గింజల పొడిని పేస్టులాగా చేసి మసాజ్ చేస్తే ఆ ఎముక భాగం పెరిగి అతుక్కుంటాయి.
*అధిక బరువును తగ్గిస్తాయి.
*చింత గింజల లో ట్యానిక్ కెమికల్ ఉండటం వల్ల బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులను అడ్డుకుంటాయి.
*చింత గింజల పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే వెన్నునొప్పి సమస్యలు తొలగిపోతాయి.
*డయాబెటిస్ను కంట్రోల్ చేస్తాయి.
*చర్మ సంబంధిత రోగాలను రాకుండా చేస్తాయి.
*చింత గింజల్లో యాంటీ క్యాన్సర్ కణాలు కూడా ఉంటాయి.