Salt deepam benefits in telugu | లక్ష్మీదేవి ఉప్పు దీపం ఎలా పెట్టాలి
రాత్రి పడుకునే ముందు స్త్రీలు ఈ ఒక్క పని చేస్తే చాలు!
కుబేరులు అవుతారు!!
ప్రపంచంలో ఏ పని జరగాలన్నా అందుకు లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి. అందుకే లక్ష్మీదేవి చూపు తమ మీద ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దీని కోసం కొంత మంది రకరకాల పూజలు, వ్రతాలు మరియు నోములు చేస్తూ ఉంటారు. మరికొంతమంది యజ్ఞాలు యాగాలు కూడా చేస్తారు.
నిజం చెప్పాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ప్రదేశం మరియు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే మనం చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి.
1. రాత్రి భోజనాల తర్వాత ఎంగిలి పాత్రలు అలానే వదిలివేయకూడదు.
2. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి.
3. రాత్రి భోజనాల తర్వాత అన్నం వండే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి.
4. అన్నం వండిన గిన్నెలో కొద్దిపాటి అన్నాన్ని అలానే నిల్వ ఉంచాలి.
5. వంట ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం
6. సింహద్వారం / ప్రధాన ద్వారం దగ్గర చెప్పులు చిందరవందర వేయకూడదు.
7. గడపకు పసుపు కుంకుమలు ప్రతిరోజు పూయాలి మంచి అలంకారం చేయాలి.
8. ఎర్రని కుంకుమ తో స్వస్తిక్ గుర్తు వేయాలి.
9. సూర్యుడు పుట్టకముందే ఇంటి ఇల్లాలు నిద్రలేచి చ దూప దీప నైవేద్యం చేయాలి.
10. శుచి శుభ్రత ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం చేసుకుంటుంది.
11. తప్పనిసరిగా రాత్రి తిన్న వంట పాత్రలను శుభ్రం చేసుకోవాలి.
12. ఇంటి గుమ్మం ముందు తప్పకుండా ముగ్గు వేయాలి.
13. అశుభ్రంగా ఉన్న ఇంట్లో దరిద్ర దేవత తిష్టవేసుకుని ఉంటుంది.
14. ఇంట్లో ఇల్లాలు అశాంతితో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు.
15. ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయాలి. తల్లిదండ్రులను గురువులను పెద్దలను భక్తిశ్రద్ధలతో చూడాలి.
16. ఇంట్లో ఉన్న పెద్ద వారిని తిడితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివాసం చేయదు.
17. ఉదయం మరియు సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి.
18. సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత విద్యుత్ దీపాలు వెలిగించు కోవాలి.
ఇవి కూడా చదవండి :-