కార్తిక మాసంలో ఈ తప్పులు చేయకండి – శివుని ఆగ్రహానికి గురి కాకండి

Karthika masam pooja vidhanam telugu lo | కార్తీక మాసం పూజా విధానం

కార్తీక మాసంలో ఈ ఐదు తప్పులు చేస్తే శివుడు ఆగ్రహిస్తాడు… మీ ఇల్లు సర్వ నాశనమే!!!

ఈ కార్తీకమాసంలో పరమశివునికి ఒక చిన్న పుష్పం సమర్పించిన అది నేరుగా శివునికి అందుతుంది. కాబట్టి ఈ కార్తీకమాసంలో ఎక్కువగా పుణ్య కార్యాలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు అధిక లాభాలు కలిగి మీ సంతానానికి అంతా మంచే జరుగుతుంది.

ఈ కార్తీకమాసంలో మీ మనసులోని కోరికలు నెరవేరాలంటే శివునికి జలంతో అభిషేకం చేయాలి. అంతే కాకుండా ఈ మాసంలో శివునికి విశేషమైన రూపంలో పూజలు చేయాలి. ఈ కార్తీక మాసంలో 5 కార్తీక సోమవారాలు తప్పకుండా కార్తీకమాస వ్రతాన్ని పాటిస్తూ, పూజలు, అభిషేకాలు చేయడం వల్ల మీ కోరికలు అన్ని నెరవేరుతాయి.

నవంబరు 8, 15, 22, 29 కార్తీక సోమవారాలు. డిసెంబర్ 4వ తేదీ చివరి కార్తీక సోమవారం అవుతుంది. కార్తీకమాసంలో శివుని తో పాటు మహావిష్ణువు కు కూడా పూజలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ప్రతి కార్తీక సోమవారం కార్తీక స్నానం, పూజ, వ్రతం తప్పనిసరిగా చేయాలి.

కార్తీక సోమవారం రోజు ఉపవాసముండి శివునికి పూజ చేస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయి. కార్తీకమాసంలో చేసే దీపారాధన వలన గత జన్మల పాపాలు తొలగిపోతాయి. వివాహితులు కార్తీకమాస దీపారాధన చేస్తే వారి భర్తలు దీర్ఘాయుష్షుతో ఉంటారు.

కార్తీకమాసంలో బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి చెరువు, కాలువ, నది వంటి ప్రాంతాలలో స్నానం చేసి పూజ చేయాలి. స్నానం చేసేటప్పుడు “హరహరశంభో” అని పటిస్తూ స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మీ మనసులోని సంకల్పాన్ని చెప్పుకుని స్నానం చేయాలి.

“గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు” అని ఈ శ్లోకం చదువుతూ స్నానం చేస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేస్తే కలిగే ఫలితం, దీనివల్ల మీరు పొందుతారు. స్నానం తర్వాత దీపారాధన చేసి నైవేద్యం పెట్టాలి.

ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేయాలి. పూజ పూర్తి చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో శివుని తప్పకుండ దర్శించుకోవాలి. ఆ తర్వాత ఆ సాయంకాలం శివాలయంలో దీపారాధన చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి.

మరియు మీ ఇంటి ప్రధాన ద్వారం తో పాటు ఇతర ద్వారాల వద్ద కూడా దీపాలు వెలిగించాలి. దీపాలను దానం చేయాలి. స్వయంగా వంట చేసి ఇతరులకు పంచి పెట్టాలి.

చేయకూడని తప్పులు:-

1. కార్తీకమాసంలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటివి తినకూడదు.

2. మాంసాహారం తీసుకోవడం, మద్యపానం నిషేధ కరమైన పనులు.

3. పవిత్రమైన ఈ కార్తీకమాసం లో భార్య భర్తలు శారీరకంగా కలుసుకో కూడదు. భర్తలు షేవింగ్ మరియు కటింగు చేయించుకోరాదు.

4. శివునికి ఇష్టమైన ఈ కార్తీకమాసంలో ఇంట్లో ఎవరూ కూడా ఏడవకూడదు.పగలు నిద్రపోకూడదు.

5. ఇంట్లో గొడవలు పడకూడదు అశుభమైన మాటలు వాడకూడదు.

6.స్రీలు రుతుస్రావం సమయంలో ఎలాంటి పూజలు చేయరాదు.

7.కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో పూజలు చేయాలి.

8.దీపాలు వెలిగించి నదిలో కానీ, నీటిలో గాని వదలాలి.

9.ఉసిరి దీపం, వెండి దీపం దానం చేస్తే సకల పుణ్యాలు కలుగుతాయి.

10.ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి

ఇవి కూడా చదవండి :-

  1. మగవారిలో కోర్కేలో పెరగాలంటే ఇవి గుప్పెడు తింటే చాలు
  2. రాత్రి పడుకునే ముందు స్త్రీలు ఇలా చేస్తే కుబేరులు అవుతారు
Share on:

Passionate about latest Technology and new Apps In Android & Ios. Sharing my knowledge through my website.