జీవితంలో పుచ్చు పళ్ళు రాకుండా ఇలా చేయండి

How to remove cavity from teeth at home in telugu | పుచ్చు పళ్ళు నివారణ

మీజీవితంలో పళ్ళు పుచ్చిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి. పుచ్చులు తగ్గాలన్నా ఇలా చేయండి.

ప్రస్తుత రోజుల్లో దాదాపు 80 శాతం మందికి పళ్ళు పుచ్చి పోతూ ఉంటాయి. పళ్ళు పుచ్చిపోకుండా ఉండడానికి ఈ క్రింది సూచనలు పాటించండి.

*ఎలాంటి టూత్ పేస్ట్ కైనా కేవలం కొంత సమయం మాత్రమే క్రిములతో పోరాడే శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి పళ్ళు పుచ్చిపోకుండా ఉండాలని పేస్ట్ మీద ఆధారపడకూడదు.

*పళ్ళ మీద గార పట్టకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. పళ్ళకు హాని కలిగించే ఆహార పదార్థాలను తీసుకోకూడదు.

*ప్రధానంగా స్వీట్స్ అతిగా తినకూడదు.

*చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, మైదాతో తయారు చేసిన పిండి పదార్థాలు మరియు కేకులు, బేకరీ ఐటమ్స్, జామ్స్, చల్లటి ఐస్క్రీమ్లు తీసుకోకూడదు, అతిగా తినకూడదు.

చెరకు :-

 • చెరకు తినడం వల్ల ఎప్పటికీ కూడా దంతక్షయం కాదు.
 • అంటే పళ్ళ మీద గార పట్టదు. పుచ్చు పట్టదు.
 • ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత కనీసం నాలుగైదు చెరుకుముక్కలు నేరుగా నమలాలి.
 • చెరకు నమలడం వల్ల దంతాలు చాలా బాగా శుభ్రపడతాయి.
 • చెరుకు రసం తాగడం వల్ల పళ్ళు పుచ్చి పోవడం జరుగదు.
 • చెడు బ్యాక్టీరియాను చంపే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
 • చెడు క్రిములను పెరగకుండా చేస్తుంది.

ఒక రోజులో తప్పనిసరిగా నేచురల్ ఫుడ్ ఐటమ్స్ అయిన మొలకెత్తిన గింజలు కానీ, పచ్చికొబ్బరి కానీ బాగా నమలడం వల్ల దంతాలు సహజం గా శుభ్రపడుతాయి. స్వీట్ కార్న్ గింజలు కూడా నమలవచ్చు.

దానిమ్మ గింజలు లేదా కమలాపండు తొనలు నమలడం. రాత్రి భోజనం తర్వాత ఫ్రూట్స్ అధికంగా తినడం. వీటిని తినడం వల్ల నోటిలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.

వీటిని నములుతూ ఉన్నప్పుడు విడుదలయ్యే లాలాజలంలో ఉండే రసాయనాలు నోటిలో ఉండే క్రిములను చంపేస్తాయి. పవర్ ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా సహజమైన పండ్లు మంచి పనులు చేస్తాయి. దీని ద్వారా నోటి ఆరోగ్యం బాగుంటుంది.

ఇవి కూడా చదవండి :-

 1. చనిపోయేంత వరకు రాదు నడుంనొప్పి, మోకాళ్ళనొప్పి, ఎప్పటికీరావు
 2. మూడో వేవ్ రాకుండా మీరు ఇలాంటి జాగ్రత్తలు వెంటనే తీసుకోండి
 3. మీ ఎముకనలు ఉక్కులగా మార్చుకోండి – కావాల్సిందల్లా ఇదే మరి !
 4. రాత్రి పడుకునే ముందు స్త్రీలు ఇలా చేస్తే కుబేరులు అవుతారు