మూడో వేవ్ రాకుండా మీరు ఇలాంటి జాగ్రత్తలు వెంటనే తీసుకోండి

Home remedies for cold and cough in telugu new tips | కఫం పోవాలంటే ఏం చేయాలి

తరుముకొస్తున్న మూడో మహమ్మారి!!
ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? అయితే జాగ్రత్త!!!

శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వైజ్ఞానికులు ప్రస్తుతం కరోనా యొక్క (మూడవ అల) థర్డ్ వేవ్ గురించి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం చిన్నారుల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

ఇటీవలే నిర్వహించిన జాతీయ స్థాయి సర్వేలో దాదాపు కొంత మంది చిన్నారులకు కోవిడ్ థర్డ్ వేవ్ సోకిందని తెలిసింది. ప్రస్తుత కరోనా యొక్క మూడవ ముప్పు ప్రతి ఒక్కరికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. కరోనా మొదటి వేవ్ లో వృద్ధులు, 2 వ వేవ్ లో యువకులు, మూడవ వేవ్ లో పిల్లలు గురికావాల్సి వస్తుందని తెలియ చేస్తున్నారు.

లక్షణాలు:-

 1. పిల్లల్లో రెండు నుంచి నాలుగు వారాల పాటు ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అనేది కలుగుతుంది.
 2. ప్రధానంగా పిల్లల్లో రోగ నిరోధకశక్తి తగ్గిపోయి, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.
 3. అయితే లక్ష మంది పిల్లల్లో కేవలం 12 మందికి మాత్రమే ఇది ప్రభావం చూపుతున్న ట్లు సైంటిస్టులు తెలియజేశారు.
 4. అయినా కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం పనికి రాదు అని కూడా చెప్పారు.
 5. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే చిన్నారుల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి.
 6. ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం సమస్యలు వంటి వాటితో బాధపడే పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెబుతున్నారు.
 7. ముఖ్యంగా తలసేమియా వ్యాధితో బాధపడే పిల్లలు త్వరగా ఈ మహమ్మారి బారిన పడే అవకాశాలు ఉన్నాయి.
 8. క్యాన్సర్ కు గురై కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరఫీ తీసుకుంటున్న వారు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
 9. స్థూలకాయం సమస్య మరియు పోషకాహార లోపంతో బాధపడే పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

పిల్లల్లో ఎక్కువగా కనిపించే లక్షణాలు:-

దగ్గు, జలుబు, జ్వరం, ఊపిరిపీల్చుకునే సమస్యలు, ముక్కుదిబ్బడ, గొంతు నొప్పి, గొంతులో మంట, కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి రావడం ఇవన్నీ ప్రధానంగా మహమ్మారి సోకినట్లు గా తెలియ చేసే సూచనలు.

జాగ్రత్తలు:-

*పిల్లలు తప్పనిసరిగా మాస్కు ధరించాలి

*చేతు లను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి

*శానిటైజర్ తప్పనిసరిగా ఉపయోగించాలి

*భౌతిక దూరం పాటించాలి

*ఈ జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి బారిన పడకుండా ఉంటామని పిల్లలకు సున్నితంగా తెలియజేయాలి.

*ముఖ్యంగా పిల్లలకు విటమిన్ బి కాంప్లెక్స్, జింక్, కాల్షియం, ప్రోబయోటిక్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు అధికంగా ఉండేటట్లు జాగ్రత్త వహించాలి.

*పిల్లలను ఇండోర్ గేమ్స్ కు మాత్రమే అనుమతించాలి

*పిల్లలు తరచూ బాధపడే జలుబు, దగ్గు వంటి సమస్యలకు ఇన్ఫ్లూయెంజా వైరస్ టీకాలు వేయించాలి.

*ఒకవేళ పిల్లల్లో ఏవైనా లక్షణాలు కనిపిస్తే పదిరోజులపాటు మరియు తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే 20 రోజులపాటు ఐసోలేషన్ లో ఉంచాలి.

*పిల్లలను ఐసోలేషన్ లో ఉంచినప్పుడు పెద్దవారి సహకారం తప్పకుండా ఉండాలి.

*పిల్లలకు ఈ మహమ్మారి సోకితే వారిని పెద్దలు ఉండే చోటుకు పంపకూడదు.

పిల్లలకు ఇవ్వాల్సిన ఔషధాలు:-

 1. పారాసెటమాల్ 50 mg
 2. ప్రతి నాలుగు నుంచి ఆరు గంటలకు ఒకసారి ఇవ్వాలి.
 3. గొంతులో మంట మరియు దగ్గు ఉంటే గోరువెచ్చని నీటిని పుక్కిలించాలి.

ఆహారం:-

పండ్ల రసాలతో పాటు మంచి నీరు అధికంగా ఇవ్వాలి.

ఎదిగే పిల్లల్లో లక్షణాలు:-

 • జలుబు మరియు తేలికపాటి జ్వరం ఉంటే పిల్లలకు ఇంట్లోనే చికిత్స చేయించాలి.
 • ఒకవేళ ఊపిరి తీసుకునే సమస్యతో బాధపడుతుంటే, తరచుగా వాంతులు, విరేచనాలు అవుతుంటే వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
 • ఎక్కువ రోజుల పాటు అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
 • ఈ మూడవ మహమ్మారి ఎక్కువగా 14 సంవత్సరాల లోపు పిల్లల మీద ప్రభావం చూపుతుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
 • హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిపుణుల అభిప్రాయాల ప్రకారం, పిల్లల్లో జ్వరము, చర్మం మీద దద్దుర్లు, కళ్లల్లో ఎర్రని చారలు, ఆకలి లేకపోవడం, వాంతులు, అజీర్ణం కావడం, పగిలిన పెదవులు లేదా పెదవులు ఎర్రగా మారడం, మెడ నొప్పి, కాళ్లు చేతులు వాపు రావడం, అతినిద్ర, చికాకు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

పిల్లలతో శారీరకశ్రమ తప్పనిసరిగా చేయించాలి. యోగా మరియు ఇతర వ్యాయామాలు అలవాటు చేయించాలి. ఆసనాలు వేయించడం నేర్పించాలి.

ఇవి కూడా చదవండి :-

 1. ఇంత చిన్న చిట్కా ముందే తెలిస్తే బాగుండు…ఈజీగ బరువు తగ్గొచ్చు
 2. రాత్రి పడుకునే ముందు స్త్రీలు ఇలా చేస్తే కుబేరులు అవుతారు
 3. మగవారిలో కోర్కేలో పెరగాలంటే ఇవి గుప్పెడు తింటే చాలు
Share on:

Passionate about latest Technology and new Apps In Android & Ios. Sharing my knowledge through my website.