ఈ రోజున ఉపవాసం ఉంటె కోటి జన్మల పుణ్యం – నవంబర్ 18 లేదా 19 ?

Karthika pournami upavasam procedure | కార్తీక పౌర్ణమి ఉపవాసం ఎలా చేయాలి ?

ఉపవాసం ఏ రోజు ఉంటే కోటి జన్మల పుణ్యం వస్తుంది? నవంబర్ 18 లేక 19?

ఎంతో మంది ఎదురు చూసే గొప్ప పండుగ కార్తీకపౌర్ణమి. ఈ సందర్భంగా ఉపవాసం నవంబర్ 18 లేక 19 ఉండాలో అనే సందేహంతో ఉన్నారు.
కార్తీక పౌర్ణమి అంటే ఆ రోజు పౌర్ణమి ఘడియలు ఉండాలి. అలాగే కృత్తికా నక్షత్రం ఉండాలి. ఇలా కృత్తికా నక్షత్రం ఉన్న రోజు పౌర్ణమి వస్తే దానిని కార్తీక పౌర్ణమి అంటారని పురాణాల్లో ఉన్నది.

కార్తీక పౌర్ణమి వేళలు:-

  • పౌర్ణమి తిధి ప్రారంభం : నవంబర్ 18, 2021, 12:00 మధ్యాహ్నం.
  • పౌర్ణమి తిథి ముగిసేది : నవంబర్ 19, 2021, 2:26 మధ్యాహ్నం.

19వ తేదీ తెల్లవారుజామున ఒకటిన్నరకు కృత్తికా నక్షత్రం ప్రారంభమై 20వ తేదీ తెల్లవారుజామున 4:29 వరకు ఉంటుంది. కాబట్టి ఈ వేళ ప్రకారం పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నవంబరు 19వ తేదీ జరుపుకోవాలి.

కార్తీక పౌర్ణమి సందర్భం ను దేవాలయంలో జరుపుకునే వాళ్ళు 365 వత్తులు ఉంచి దీపారాధన చేయాలి. ఒకవేళ మీరు కార్తీక పౌర్ణమి ఇంటి దగ్గరే ఉపవాసం చేసుకునే సందర్భంలో 18 వ తేదీన ఉపవాసం ఉండాలి. అలాగే ఉసిరి చెట్టు దగ్గర 365 వత్తుల దీపం వెలిగించాలి.

అయితే దేవాలయంలో కార్తీక పౌర్ణమి ఉపవాసం నిర్వహించే వాళ్ళు తప్పనిసరిగా కార్తీక పౌర్ణమి ఘడియలు మరియు కృత్తికా నక్షత్రపు తిధిని ప్రామాణికంగా తీసుకోవాలి.

ముఖ్యమైన విషయం ఏమనగా, 19వ తేదీ తెల్లవారుజాము నుండి 2:26 వరకు కార్తీక పౌర్ణమి ఘడియలు ఉండడంవల్ల ఈ సమయంలో, కార్తీక స్నానం చేసి ఆ తర్వాత దీపారాధన చేసి ఉపవాసం ఉండటం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితాలు కలుగుతాయి.

కార్తీక పౌర్ణమి రోజు చేయవలసినవి :-

తెల్లవారుజామునే నిద్ర లేవాలి. కార్తీక స్నానం చేయాలి. 365 వత్తులతో దీపారాధన చేయాలి. తూర్పు వైపు తిరిగి ఆకాశంలోకి చూస్తూ కృత్తికా నక్షత్రాన్ని దర్శించుకోవాలి. ఉపవాసం చేయాలి. ఉపవాసంలో పండ్లు, పచ్చి పాలు మాత్రమే తీసుకోవాలి.

దైవ సన్నిధి లో ఉండి దైవనామస్మరణ మాత్రమే చేయాలి. శివాలయంలో ఇచ్చే పలహారం తినవచ్చు. శివలింగానికి నీటితో అభిషేకం చేయాలి. దీనివల్ల శివుడు సంతోషించి వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు. ఎంతటి పేదవారినైనా గొప్ప ధనవంతులు గా మారుస్తాడు.

కార్తీక పౌర్ణమి రోజు చేయకూడనివి :-

ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోరాదు. నేలమీద చాప వేసుకుని కూర్చోవాలి. మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. పొరపాటున తీసుకున్న వారు తప్పకుండా నరకానికి వెళతారు. పూజకు మొగలిపువ్వు వాడకూడదు.

ఇవి కూడా చదవండి :-

  1. కార్తిక మాసంలో ఈ తప్పులు చేయకండి – శివుని ఆగ్రహానికి గురి కాకండి
  2. మగవారిలో కోర్కేలో పెరగాలంటే ఇవి గుప్పెడు తింటే చాలు
  3. రాత్రి పడుకునే ముందు స్త్రీలు ఇలా చేస్తే కుబేరులు అవుతారు