రేషన్ కార్డ్ లో మెంబెర్స్ ని డిలీట్ చేసే ఫారం ని ఇక్కడ పొందండి

0
ration card delete form

మన రాష్ట్రంలో ఇప్పుడు రేషన్ కార్డ్ ఎంతో అవసరం, ఎందుకంటే మన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నో ఉచిత పథకాలు అందిస్తున్నారు. వీటన్నిటికీ రేషన్ కార్డ్ ఉంటేనే అర్హులు అవుతారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ రేషన్ కార్డులో సభ్యులుగా నమోదు చేయబడి ఉండాలి. కొన్ని కారణాల వల్ల రేషన్ కార్డులో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు రేషన్ కార్డులో ఎవరినైనా డిలీట్ చేయాలి అంటే కొత్త ప్రాసెస్ అమలులోకి వచ్చింది.

ఇందుకోసం మనం చేయాల్సింది ఏంటంటే మన గ్రామ వాలంటరీ సభ్యున్ని సంప్రదించాలి. వాళ్లు అప్లికేషన్ ఫామ్ నింపి మనం ఎవరి పేరు తొలగించాలో వారి వివరాలను పొందుపరుస్తారు. తద్వారా రేషన్ కార్డులో మార్పులు సాధ్యమవుతాయి. ఈ ఫారం లో గ్రామ వార్డ్ వాలంటీర్ కొన్ని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే రేషన్ కార్డ్ నుండి తొలగించాల్సిన వ్యక్తి కి సంభందించిన పూర్తి డీటెయిల్స్ నమోదు చేయాలి. అసలు కార్డ్ నుండి ఎందుకు తొలగించాలి ? అతని ఆదార్ ఏంటి, రేషన్ కార్డు నెంబర్ ఏంటి ? లాంటివి ఫిల్ చేయాలి.

గ్రామ వార్డు వాలంటీర్ కి అవసరమైన form ఈ కింద లింక్ ద్వారా ఇవ్వడం జరిగింది. వెంటనే డౌన్లోడ్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయండి.

   download pdf

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here