కీళ్ళ , వాత నొప్పులు, నరాల బ్లోకేజేస్, రక్తం పలుచబడటం అన్ని ఇందులోనే ఉన్నాయి.

Menthulu benefits in telugu for hair loss, for skin, for diabetes | మెంతులు ఉపయోగాలు

నరాలలో బ్లాకేజ్, నరాల బలహీనత సమస్యలను ఇలా తొలగించుకోండి.

వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది నరాల్లో బ్లాకేజ్, నరాల బలహీనత, బ్యాడ్ కొలెస్ట్రాల్, బిపి మరియు డయాబెటిస్ వంటి రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి అనారోగ్య సమస్యలను ఎటువంటి మందులు ఉపయోగించకుండా వంటింట్లో లభించే పదార్థాలతో వాత రోగాలు, ఒబేసిటీ వంటివి కూడా తగ్గించు కోవచ్చు.

మనం ఎదుర్కొంటున్న అనేక అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణాలు మన లైఫ్ స్టైల్ మరియు మన ఆహారపు అలవాట్లు మీద ఆధారపడి ఉంటాయి. అంటే మనం కూర్చునే విధానం, తాగే విధానం, తినే విధానం అన్నీ కూడా అసహజమైన పద్ధతులు పాటించడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి.

పొటాషియం అధికంగా లభించే అరటిపండును ప్రతిరోజు తినడం అలవాటు చేసుకోవాలి. కాళ్లు, చేతులు, కండరాల నొప్పులు, నిద్రలో కాళ్ళు పట్టుకు పోయే సమస్య ఉన్నవారు రోజుకు రెండు అరటి పండ్లు కచ్చితంగా తినాలి.

ఒకవేళ మీరు అరటిపండు తినక పోయినట్లయితే ఉడికించిన బంగాళదుంప ను తినాలి. పాలకూరను పప్పుగా చేసి తీసుకోవాలి.
పాలు మరియు పాలతో తయారుచేసిన పదార్థాలను ప్రతిరోజు తీసుకోవాలి. భోజనం తిన్న తర్వాత చిన్న బెల్లం ముక్క తినే అలవాటు చేసుకోవడం చాలా మంచిది.

భోజనం తిన్న తర్వాత బెల్లం ముక్క తింటూ ఉంటే మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. దీంతోపాటు తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. బాదం పప్పు, అవిస గింజలు, నువ్వులు, పొద్దుతిరుగుడు గింజలు తింటూ ఉంటే వీటిద్వారా మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది.

వీటివల్ల శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ బాగా లభిస్తాయి. వీటన్నింటినీ క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే నరాల బలహీనత, నరాలు బ్లాక్ కావడం తొలగిపోతాయి. మెంతులు మన శరీరానికి చాలా ప్రయోజనం కలిగిస్తాయి. మెంతులను ప్రతి ఒక్కరూ తప్పకుండా వారి యొక్క డైట్ లో చేర్చుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.

కావలసిన పదార్థాలు :- అరచెంచా మెంతులు, ఒక చిన్న దాల్చిన చెక్క.

అర చెంచా మెంతులు , దాల్చిన చెక్క గ్లాసులో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం పరగడుపున ఆ నీటిని తాగి మెంతులను, దాల్చిన చెక్కను నమిలి మింగాలి. ఇలా 15 రోజుల పాటు తీసుకుంటే మీ శరీరంలో మార్పులు మీరే గమనిస్తారు.

ఇందులో దాల్చిన చెక్క రక్త ప్రసరణ వ్యవస్థను సులభతరం చేస్తుంది. దాల్చిన చెక్క వాత దోషాలను తొలగిస్తుంది. ప్రధానంగా డయాబెటిస్ మరియు బిపి లను నియంత్రణలో ఉంచుతుంది.

ఈ చిట్కా వైద్యం అధిక బరువుతో బాధపడుతున్న వారికి చాలా చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే శరీరంలో అనవసరంగా పెరిగిపోయిన కొవ్వు కరిగిపోతుంది.

రాత్రిపూట నిద్రకు ముందు ఒక గ్లాసు పాలు గోరువెచ్చగా తాగితే మీ శరీరంలో కాల్షియం శాతాన్ని పెంచి, ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇంకా పసుపు శరీరంలో నొప్పులు, వాపులు వంటివి తగ్గిస్తుంది. పసుపులో యాంటి ఇన్ఫ్లమేటరీ క్యారెక్టర్స్ అధికంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి :-

  1. జీవితంలో పుచ్చు పళ్ళు రాకుండా ఇలా చేయండి
  2. చనిపోయేంత వరకు రాదు నడుంనొప్పి, మోకాళ్ళనొప్పి, ఎప్పటికీరావు
  3. మూడో వేవ్ రాకుండా మీరు ఇలాంటి జాగ్రత్తలు వెంటనే తీసుకోండి
  4. మీ ఎముకనలు ఉక్కులగా మార్చుకోండి – కావాల్సిందల్లా ఇదే మరి !
  5. చెడు కొలెస్ట్రాల్ ని ఇలా తొలగించండి