Home remedies for hair growth and thickness in telugu | జుట్టు పెరగాలంటే ఏం చేయాలి చిట్కాలు
కేరళ వాళ్ల జుట్టు అసలు రహస్యం : ఆరోగ్యకరమైన జుట్టు, మెత్తని పట్టులాంటి జుట్టు కోసం ఇంట్లో తయారు చేసుకోవలసిన మిశ్రమం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు మరియు వస్తువులు:- ఇనుప బాండ్లీ లేదా పెద్ద ఐరన్ పెనుము
- రెండు కప్పుల స్వచ్ఛమైన కొబ్బరినూనె, ఒక కప్పు పచ్చి కలబంద ముక్కలు, మందారం ఆకులు ఒక గుప్పెడు, కరివేపాకు ఒక గుప్పెడు గోరింటాకు ఒక కప్పు, పిడికెడు లవంగాలు ఇనుప బాండ్లీ లోకి వేయాలి.
- 15 పచ్చి ఉసిరికాయలు తీసుకొని ముక్కలుగా కోసి, వీటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- ఆ తర్వాత కాగుతున్న నూనెలో వేయాలి. రెండు చెంచాల మెంతులు వేయాలి.
- రెండు ఎఱ్ఱని ఉల్లిపాయలను ముక్కలుగా కోసి వేయాలి. బాగా మరుగుతున్న కొబ్బరినూనె లోకి గుమ్మడి గింజలు ఒక గుప్పెడు వేయాలి.
- 200 గ్రాములు అల్లం తీసుకుని ముక్కలుగా కోసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి.
- ఈ పేస్ట్ ను మరుగుతున్న నూనెలో వేయాలి. 8 ఒంటి రెక్క మందారం పూలు వేయాలి.
- ఒక చెక్క గరిట తీసుకుని వీటిని బాగా కలుపుతూ, బాగా నూనెలో మరిగించాలి.
- తర్వాత మెత్తటి కాటన్ గుడ్డ ద్వారా నూనెను వడపోసుకొని వాడుకోవాలి.
- నల్లగా నిగనిగలాడే ఈ నూనెను చల్లారిన తర్వాత సీసాలో భద్రపరుచుకోవాలి.
- ఈ నూనెను తలకు పట్టించిన తర్వాత మీరు తలస్నానం చేయడానికి ఎలాంటి కెమికల్స్ లేని షాంపూ ని మాత్రమే వాడాలి.
కేరళ వారి వంటింటి కొబ్బరి నూనె ప్రయోజనాలు:-
*జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
*జుట్టు పొడవుగా పెరుగుతుంది
*తెల్ల వెంట్రుకలు రావు
*వెంట్రుకలు రాలిపోవడం జరగదు
*జుట్టు పట్టులా గా, సిల్కీ గా మారుతుంది.