కేరళ అమ్మాయిలకు ఉండే జుట్టు లాగా మీకు రావాలంటే వెంటనే ఇలా చేయండి

Home remedies for hair growth and thickness in telugu | జుట్టు పెరగాలంటే ఏం చేయాలి చిట్కాలు 

కేరళ వాళ్ల జుట్టు అసలు రహస్యం : ఆరోగ్యకరమైన జుట్టు, మెత్తని పట్టులాంటి జుట్టు కోసం ఇంట్లో తయారు చేసుకోవలసిన మిశ్రమం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు మరియు వస్తువులు:- ఇనుప బాండ్లీ లేదా పెద్ద ఐరన్ పెనుము

  • రెండు కప్పుల స్వచ్ఛమైన కొబ్బరినూనె, ఒక కప్పు పచ్చి కలబంద ముక్కలు, మందారం ఆకులు ఒక గుప్పెడు, కరివేపాకు ఒక గుప్పెడు గోరింటాకు ఒక కప్పు, పిడికెడు లవంగాలు ఇనుప బాండ్లీ లోకి వేయాలి.
  • 15 పచ్చి ఉసిరికాయలు తీసుకొని ముక్కలుగా కోసి, వీటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  • ఆ తర్వాత కాగుతున్న నూనెలో వేయాలి. రెండు చెంచాల మెంతులు వేయాలి.
  • రెండు ఎఱ్ఱని ఉల్లిపాయలను ముక్కలుగా కోసి వేయాలి. బాగా మరుగుతున్న కొబ్బరినూనె లోకి గుమ్మడి గింజలు ఒక గుప్పెడు వేయాలి.
  • 200 గ్రాములు అల్లం తీసుకుని ముక్కలుగా కోసి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి.
  • ఈ పేస్ట్ ను మరుగుతున్న నూనెలో వేయాలి. 8 ఒంటి రెక్క మందారం పూలు వేయాలి.
  • ఒక చెక్క గరిట తీసుకుని వీటిని బాగా కలుపుతూ, బాగా నూనెలో మరిగించాలి.
  • తర్వాత మెత్తటి కాటన్ గుడ్డ ద్వారా నూనెను వడపోసుకొని వాడుకోవాలి.
  • నల్లగా నిగనిగలాడే ఈ నూనెను చల్లారిన తర్వాత సీసాలో భద్రపరుచుకోవాలి.
  • ఈ నూనెను తలకు పట్టించిన తర్వాత మీరు తలస్నానం చేయడానికి ఎలాంటి కెమికల్స్ లేని షాంపూ ని మాత్రమే వాడాలి.

కేరళ వారి వంటింటి కొబ్బరి నూనె ప్రయోజనాలు:-

*జుట్టు ఒత్తుగా పెరుగుతుంది

*జుట్టు పొడవుగా పెరుగుతుంది

*తెల్ల వెంట్రుకలు రావు

*వెంట్రుకలు రాలిపోవడం జరగదు

*జుట్టు పట్టులా గా, సిల్కీ గా మారుతుంది.